టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందారు. అర్థరాత్రి దాటిన తర్వాత బడేటి బుజ్జికి గుండెపోటు రావడంతో ఆంధ్ర హాస్పిటల్ కు తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. బుజ్జి మరణవార్త తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఏలూరు నుంచి ఆయన మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి 24,603 ఓట్లతో బడేటి బుజ్జి భారీ విజయాన్ని అందుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. గత ఎన్నికల్లో మాత్రం 4072ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో బడేటి బుజ్జి ఓటమిపాలయ్యారు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడే బడేటి బుజ్జి.