గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సుజనాచౌదరిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీడీపీ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిణామాలపైనా సుజనాకి వివరించినట్టు సమాచారం. దీనిపైనా సుజనా కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది.వల్లభనేని వంశీ బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయా వర్గాల్లో వినిపిస్తుంది. ప్రకాశంలో జరుగుతున్న గాంధీ కంకల్ప యాత్రకు సుజనా కారులోనే వంశీ వెళ్లటంతో మరిన్ని అనుమానాలకు దారి తీస్తుంది.