ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ తో భేటీ అయ్యారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాడేపల్లి లోని జగన్ నివాసానికి చేరుకున్న వల్లభనేని వెంట వైసీపీ మంత్రులు పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కోడలి కూడా చేరుకున్నారు. ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కూడా వంశీ భేటీ అయ్యారు. టీడీపీ లో తనకు ఎదురవుతున్న పరిస్థితులను సుజనాకి చెప్పినట్టు సమాచారం. తాజాగా జగన్ నివాసానికి వంశీ రావటంతో మరిన్ని అనుమానాలకు దారి తీస్తుంది.