2 వేల కోట్లు అంటూ సాక్షి సిత్రాలు, వైకాపా నాయకుల డ్రామాలు పటాపంచలు అయ్యాయన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండువేల కోట్ల రూపాయలు దొరికాయంటూ వైసీపీ ప్రచారం చేసిందంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఉన్నది 2 లక్షల 63 వేలు,12 తులాల బంగారం. అంత సొమ్ము మాకొద్దు అని తిరిగి ఇచ్చేశారు కూడా. అయితే ఏమైంది.. పక్కన నాలుగు సున్నాలు పెడితే పోలా.. అని జగన్ గారు ఆదేశించారు. సున్నాలు పెట్టి జగన్ గారిని ముంచడం లో నిష్ణాతుడు అయిన సాయి రెడ్డి నాలుగు సున్నాలు తగిలించి 2 వేల కోట్లు అని మొరిగి మరోసారి వైకాపా దొంగల ముఠాని ముంచేశారంటూ విమర్శించారు.
మీ కమిట్మెంట్ ని సీబీఐ, ఈడీ ఎప్పుడో మెచ్చుకుంది. తప్పుడు లెక్కలు రాయడమే కాకుండా వాటిని నీ కంప్యూటర్ లో, డైరీలో భద్రంగా దాచి ఇచ్చి జగన్ గారిని 16 నెలలు జైలుకి పంపిన విషయం మర్చిపోయారా అంటూ విజయసాయిరెడ్డి ని విమర్శించారు. జగన్ గారికి, మీకు సిగ్గు అనేది ఏ కోసానా లేదు అనుకుంట అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడే మీరు నీతులు మాట్లాడటమే పెద్ద బూతు. 2 వేల కోట్లు దొరికాయి అని మొరిగారు. నిజాలు బయటకి వచ్చే సరికి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి డైరీలు, కంప్యూటర్ అంటూ మీ అనుభవాలను చెబితే ఎలా అంటూ ప్రశ్నించారు.