యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధి వల్లే జగన్ గారు ఇలా అయిపోయారంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. అందువల్లే జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా బుద్ధా నిప్పులు చెరిగారు. ఈ వ్యాధికి అబద్దాలు చెప్పటం, దోచుకోవటం, ప్రజలును ఉల్లంఘించటం, విధ్వంసం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పుకొచ్చారు బుద్ధా వెంకన్న.
ప్రాధమిక పాఠశాలల్లో తెలుగు మీడియం ను పూర్తిగా ఎత్తేస్తున్నట్టు జగన్ తీసుకున్న నిర్ణయం పై త్రీవ్రంగా విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.