బుద్దా వెంకన్న, టీడీపీ ప్రధాన కార్యదర్శి
వివేకా హత్యకు సంబంధించి అసలు వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ అధికారులు తక్షణమే విజయసాయిరెడ్డిని విచారించాలి. ఆయన చనిపోయింది గుండెపోటుతోనా.. గొడ్డలి పోటుతోనా అన్న సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. వాస్తవాలు బయటకు రావాలంటే ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిని విచారించాలి. వివేకా చనిపోయిన వెంటనే.. ఆఘమేఘాలపై ఘటనాస్థలికి వెళ్లి.. గుండెపోటుతో మరణించారని చెప్పింది ఆయనే. అసలు విషయం బయటకు రాకముందే.. అలా ఎందుకు చెప్పారు..? సందేహాలన్నింటికీ సమాధానం రావాలంటే.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రెండేళ్లుగా పట్టి పీడిస్తున్న విజయసాయిని సీబీఐ తక్షణమే విచారణకు పిలవాలి. వివేకా మృతదేహంపై ఉన్న గొడ్డలి పోట్లని, లోతైన గాయాలను చూస్తే పాలు తాగే పిల్లాడు కూడా జరిగింది హత్యేనని స్పష్టంగా చెప్పగలడు. కానీ.. ఆయన మరణించినప్పుడు పొంతన లేకుండా విజయసాయి అలా ఎందుకు చెప్పారో సీబీఐ తేల్చాలి.
తొలుత గుండెపోటని, తరువాత హత్యని, ఆ తరువాత చంద్రబాబే చంపించారని ఏ2 పొంతన లేకుండా ఎందుకు మాట్లారో తెలియాలి. సీబీఐ పులివెందులలో విచారణకు వచ్చినప్పుడల్లా విజయసాయి ఏవో సాకులు చెబుతూ, ఎంపీనంటూ ఢిల్లీ పారిపోతున్నారు. హత్య కేసు విషయాలు విజయసాయికి తెలుసని.. ఆయన వైఖరి చూస్తుంటే మాకే కాదు ప్రజలకు కూడా అనిపిస్తోంది. అందుకే అధికారులు విజయసాయిని కూర్చోబెట్టి, కుంగదీస్తే అసలు వాస్తవాలు బయటకొస్తాయి. సీబీఐ బృందం పులివెందులకు వచ్చిందంటేనే ఆయన పల్స్ రేటు పడిపోతోంది. ఎప్పుడు తనను పిలుస్తారా అని చెమటలు పడుతున్నాయి. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐకి లేఖ కూడా రాయడానికి సిధ్ధంగా ఉన్నాం.
ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని.. ఏ2 దందాలు సాగిస్తున్నారు. విజయసాయి దోపిడీపై ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు తిరగబడటం లేదు..? ఆయన పనులకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయి కాబట్టే, ఉత్తరాంధ్రకు సీఎంగా వ్యవహరిస్తూ.. ఆ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను, భూములను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. అడిగేవారు.. ఆపేవారు లేరన్నట్లుగా ఏ2 పేట్రేగిపోతున్నారు. ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారనే వాస్తవాన్ని విజయసాయి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఉత్తరాంధ్రలో దోపిడీ కోసం ఆయన ప్రత్యేకంగా ఒక దండుపాళ్యం గ్యాంగ్ ని మెయింటెన్ చేస్తున్నారు. ఆ గ్యాంగ్ ముందుగా విజయసాయి చెప్పిన ప్రాంతాలను, ఆస్తులను, భూములను కబ్జా చేస్తుంది. తరువాత తనకేమీ తెలియనట్టే ఆయన సదరు గ్యాంగ్ ని, కబ్జాకు గురికాబడిన ఆస్తుల అసలు యజమానులను పిలిచి సెటిల్ మెంట్లు చేస్తున్నారు. ఇవేవీ ప్రజలకు తెలియవని ఏ2 భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు.