వైసీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై ఆకృత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.
నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందంటూ మీరు కురిపించిన ప్రేమ, ఆప్యాయత ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు? మీ పాలనలో బాగుండటం దేవుడెరుగు.. బతికి ఉండటమే అదృష్టంగా భావించే దురదృష్ట రోజులు దాపురించాయి.
పట్టపగలు రోడ్డుమీద మహిళలు నడవలేని దుస్థితి ఏర్పడింది. రోజుకో దుర్మార్గుడు, వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలకు మద్యపాన నిషేధం వరం ఇస్తున్నానన్న జగన్.. ప్రాణాంతక సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారు.
మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనని నిరసిస్తూ జనవరి 31న ఎన్టీఆర్ భవన్ లో తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరగనుంది. దీనికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. భద్రత-భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అన్ని విధాలా అండగా నిలుస్తాను.