అభివృద్ధి చెయ్యటంలో, సంపద సృష్టించటంలో జగన్ కు అవగాహన లేదన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల. అభివృద్ధి చేతగాకే రాజధానికి లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జపం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాస్టర్ ప్లాన్ లోనే ఉందన్నారు.
అమరావతిలో అభివృద్ధికి అవకాశం ఉన్నా.. అభివృద్ధి చెయ్యట్లేదన్నారు. రాజధాని అమరావతి లో పెట్టేటప్పుడు చంద్రబాబు అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నాకే శంకుస్థాపన చేశారని, అప్పుడు జగన్ కూడా అంగీకరించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.