శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే జోన్, ప్రత్యేక హోదాతో పాటు అనేక సమస్యల అంశాలను లేవనెత్తి వాటిపై పోరాటం చేశామని గుర్తు చేశారు. నేడు 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచి రాష్ట్ర ప్రజల కోసం పోరాడింది ఏమి లేదన్నారు.కేంద్రం, పార్లమెంట్ లో అనేక అవకాశాలు వచ్చినా వైసీపీ ఎంపీలు స్పందించలేకపోతున్నారని తెలిపారు.151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విజన్ ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా టీడీపీ పై దాడులకు పూనుకుంటున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని ప్రకటిస్తారో లేదో అని ఆలోచనతో ఉండగా,ఏపీకి మూడు రాజధానులు అవసరమని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి లెవనెత్తడం మరో కొత్త వివాదానికి తెరలేపుతున్నట్టు ఉందన్నారు. చంద్రబాబు పై కక్షతో ఆయన ప్రవేశ పెట్టినటువంటి అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలపై ఏపీ సీఎం కక్షధోరని ప్రదర్శిస్తున్నారన్నారు . ఇకనైన పగ,కక్ష రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన విషయాలపై ధృస్థి సారించాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.