భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ను అవమానపర్చింది ఏపీ సర్కార్. పదవతరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ గారి పేరు మీద ప్రతి ఏటా ప్రతిభా పురస్కార అవార్డులు ఇస్తారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తూ, వైఎస్ఆర్ ప్రతిభా పురష్కారా అవార్డులుగా పేరు మార్చింది.
దీనిపై అన్నివైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయాలకు అతీతంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కలాం పేరును కాదని, తన తండ్రి వైఎస్ పేరును చేర్చటం అవివేకమని మండిపడ్డారు శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు.