సీఎం జగన్ కు దేవుడంటే లెక్క లేదని, ప్రజలంటే గౌరవం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. శ్రీవారిపై డ్రోన్లు ఎగరవేయటం అపచారమని, అరిష్టమన్నారు. వైసీపీ నాయకులకు అహాంకారానికి హద్దేలేకుండా పోయిందని విమర్శించారు.
తిరుమలలో భక్తులపై లాఠీఛార్జ్ చేయించి సీఎం గజన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలను రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు బాగా తెలుసు జగన్ రెడ్డి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.