వైసీపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిని ఆపేసి రాష్ట్రాన్ని సీఎం జగన్ చంపేశారని ఆయన ఆరోపించారు. సీమ జిల్లాల నుంచి వలసలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు.
చిత్తూరు నియోజకవర్గం దిగువమాసపల్లి నుంచి 13వ రోజు పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు బీసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బీసీలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
పాడిరైతుల గురించి మాట్లాడితే పేటియం బ్యాచ్ అని ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు డ్రిప్, ఇతర వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభివృద్ధికి ఆదరణ పథకం కింద మొదటి విడతలో రూ. 1000 కోట్లు ఖర్చు చేశామన్నారు. రెండో విడత కోసం సామాగ్రి కొనుగోలు చేసి పంపీణి ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించరాని ఆయన ఫైర్ అయ్యారు. 90 శాతం పూర్తైన బీసీ భవనాల నిర్మాణ పనులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ సలహదారుల్లో 70 శాతం సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే నియామించరంటూ ఆయన ఆరోపించారు.