పట్టాభిరామ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
మంత్రి వెల్లంపల్లి భారీ ఇసుకదోపిడీకి పాల్పడ్డారు. ఏపీవ్యాప్తంగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో సబ్ లీజులు తీసుకుని ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్నాడు. రూ. వందల కోట్ల ఇసుకదోపిడీకి తెరలేపిన ఇసుకదొంగ, ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి. నిన్నటివరకు దేవాలయాల్లో కొబ్బరి చిప్పలు మొదలు అన్నీ మింగేసిన మంత్రి ఇప్పుడు శాండ్ మాఫియా డాన్ అవతారమెత్తాడు. మంత్రి సోదరుడు వెల్లంపల్లి రఘు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, ఇసుకలీజుల పేరుతో వందలకోట్లు దోచుకున్నాడని, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఎందుకు ఫిర్యాదు చేసింది? ఈ వ్యవహారంపై తాడేపల్లి పెద్ద జీతగాడు సజ్జల, ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఫిర్యాదుపై 04-06-2021న ఎఫ్ఐఆర్ నమోదైతే, ఇంతవరకు పోలీసులు దానిపై ఎందుకు విచారించలేదు? మంత్రికి తెలియకుండానే, ఆయన సోదరుడు, ఆయన అనుచరులు ఇసుకదోపిడీ చేశారంటే నమ్ముతారా? మంత్రిపదవిలో ఉండగానే దొరికినంత దోచుకోవాలన్న దుర్భుద్ధితోనే వెల్లంపల్లి ఇసుకలోభారీ దోపిడీకి తెరలేపారు. తప్పుడుకేసులు పెట్టడానికి, ప్రతిపక్షనేతలపైకి వచ్చే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, మంత్రి వెల్లంపల్లి బాగోతంపై ఏం చెబుతారు?
టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తే, ఈ ముఖ్యమంత్రి దాన్నే తన ఆదాయవనరుగా మార్చుకొని, పేదల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ, లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డునపడేశారు. మంత్రి వెల్లంపల్లికి అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడేఅర్హత, స్థాయి ఉందా? సోదరుడిని, బంధువులను అడ్డంపెట్టుకొని దోపిడీచేస్తూ, అశోక్ గజపతిరాజుని అంటారా? వెల్లంపల్లి అక్రమాలపై ఇది ఒక భాగం మాత్రమే, ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లికి సంబంధించి రెండో భాగం కూడా ఉంది.