పట్టాభిరామ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దోచుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. ఓవైపు ఉద్యోగులు తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా తనకు ఇష్టం వచ్చినట్లు పంపకాలకు పాల్పడుతోంది జగన్ సర్కార్.
జగనన్న గోరుముద్ద పథకంలోనూ పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. ఈ పథకానికి 60 శాతం నిధులను కేంద్రమే ఇస్తోంది. కేంద్ర నిధులను కూడా జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.
చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని లేనిపోని కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారు. దీనిపై సదరు కంపెనీ కోర్టుకు వెళ్లినా బెదిరింపులకు గురిచేసి పిటిషన్ ను వెనక్కి తీసుకునేలా చేశారు. పిల్లలకు సరఫరా చేసే చిక్కీల విషయంలో కమిషన్ ల కోసం రాష్ట్రపతి నివాసానికి సరఫరా చేసే కంపెనీపై వేటు వేయడం దారుణం.
పిల్లల దగ్గరకు వెళ్లి మేనమామ అని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ.. వారికి ఈరోజు ఆయన అసలు రంగు అర్థం అయింది. ఆయన మేనమామ కాదు.. దొంగమామ అని వాళ్లే చెప్తున్నారు. చిక్కీల విషయంలో సుమారు రూ.200 కోట్ల స్కాం జరుగుతోంది.
చిక్కీ సరఫరాకు గతేడాది రూ.136 కోట్లు ఉన్న టెండర్ ను ఈ ఏడాది అమాంతం రూ.198 కోట్లకు పెంచేశారు. అర్హత లేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారు. వివిధ స్కామ్ ల ద్వారా వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి.. వారానికి మూడుసార్లు పిల్లలకు పంచే చిక్కీలో కూడా కక్కుర్తి పడ్డారు.