ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అయితే డిసెంబర్ 02 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 15 రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో… ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే సూచనలు కనపడుతున్నాయి. ఇదే అంశాన్ని అసెంబ్లీ లో కూడా లేవనెత్తాలని ప్రతిపక్ష టీడీపీ వ్యూహం రచిస్తోంది. దీనికి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణని చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు.
తెలుగు బాషపై పట్టున్న బాలకృష్ణ ను అసెంబ్లీ లో అధికారపక్షం పై విమర్శలు చేయించాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ప్రాథమిక పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం పై అన్ని పార్టీల నాయకులతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మరీ చంద్రబాబు రచిస్తున్న వ్యూహంలో బాలయ్య ఏ మేరకు అధికార పక్షంపై అసెంబ్లీ లో విమర్శలు చేస్తారో చూడాలి.