ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య
బసవతారకం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వుంచిన కాసేపటికే కోడెల మృతిచెందినట్టు సమాచారం
హైదరాబాద్‌లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచాారం.
సొంత నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలతో కృంగిపోయిన కోడెల
రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోడెల
అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో బాగా అల్లరైన కోడెల
కుమారుడితో ఇదే అంశంపై వివాదాలు వున్నట్టు కథనాలు
కుమారుడు తీవ్రంగా కొట్టాడని ప్రత్యర్ది వర్గాలలో ప్రచారం
కొడుకు కొట్టడంతో 40 ట్యాబ్లెట్లు మింగినట్టు ప్రచారం
తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతగా కోడెలకు గుర్తింపు
ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించిన కోడెల
మాజీ సభాపతి కోడెల శివ ప్రసాదరావు మరిలేరు. అనుమానస్పద స్థితిలో హైదరాబాద్‌లో మరణించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాల సమాచారం. గుండెపోటు రావడంతో బసవతారకం ఆసుపత్రికి తరలించామని, అక్కడ ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరో పక్క ఆయన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆసుపత్రికి తరలించి వైద్యులు ఎంత ప్రయత్నించినా.. అప్పటికే ఆయన చనిపోయారని అంటున్నారు. విభజన తర్వాత రాష్ట్ర శాసనసభకు మొదటి స్పీకర్‌గా కోడెల పనిచేశారు. డాక్టర్ కోడెలగా శివప్రసాదరావు సుపరిచితులు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న కోడెల జన్మించారు. 1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల.. అపజయం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు.