విశాఖ తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు పవర్ లేని సైకిల్ వదిలి ఫ్యాన్ గాలిలో సేద తీరాలని డెసిషన్‌కి వచ్చారు.
గంటా బంధువుల కధనం ప్రకారం అధికారం లేని జీవితం, అధికార పార్టీ అండ లేని రాజకీయ జీవితం వ్యర్థమని భావించిన గంటా వైసీపీ నేతల శరణు కోరారు. తనను చేర్చుకుంటే వైసీపీకి సామజిక, ఆర్ధిక, రాజకీయ కోణంలో కలిగే లాభాలన్నిటిని పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ సందేశాన్ని సదరు నేతలు అధినేత చెవిలో వేశారు. “ఇదేదో బాగుంది కానీ మనం వేరే పార్టీ ఎంఎల్ఏలని చేర్చుకోమని చెప్పం”, అని జగన్ అన్నారట. దీనితో వైసీపీ నేతలు గంటాను రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా చేర్చుకునే ప్రయత్నాలలో పడ్డారు. ప్రస్తుతం గంటా రాజీనామా చేసి వైసీపీలో చేరే ముహూర్తం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని మా విశాఖ ప్రతినిధి చెప్తున్నారు.