తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించటం తథ్యం అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీప భవిష్యత్ లో జగన్ కు ఎదురొడ్డి నిలిచే ధైర్యం ఎవరూ చేయరని కామెంట్ చేశారు.
జగన్ మనస్తత్వంను బట్టి చంద్రబాబుపై ఆయన ఎప్పుడో కేసులు పెట్టాలని… కానీ కేసులు పెట్టడం ఆలస్యంగా ప్రారంభంకావటం ఆశ్చర్యం వేసిందన్నారు. చంద్రబాబు విజనరీ ఉన్న నేతే అయినా, తన విజనరీ జనాలకు అర్థంకాలేదన్నారు.
తాను రాజకీయాల నుండి రిటైర్ అయినట్లేనని… తుళ్లూరు వాసులే తమకు రాజధాని వద్దని తీర్పు ఇచ్చాక మాకు వచ్చిన ఇబ్బందేముంటుంది, ఎక్కడ రాజధాని పెడితే ఏంటీ అంటూ దివాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తన ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయని, తన బస్సుల్లో టికెట్ లేకపోతేనే జనం ఆర్టీసీ బస్సులెక్కుతారన్నారు. సేవ్ తాడిపత్రి పేరుతో తాము జగన్ కు ఎదురొడ్డామన్నారు.