తూర్పుగోదావరి: టీడీపీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు.
రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కాపుల తరుఫున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు.