రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. కొంతకాలంగా టీడీపీ క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉంటున్న తోట త్రిమూర్తులు త్వరలోనే పార్టీని వీడి అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. నియోజకవర్గంలో అనుచరులతో త్రిమూర్తులు సమావేశమై తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ మార్పు అంశంపై వారితో చర్చించినట్టు సమాచారం. తోట త్రిమూర్తులు పార్టీ వీడకుండా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారని, జ్యోతుల నెహ్రూను పంపించి టీడీపీని వీడవద్దని చెప్పించారని తెలిసింది. పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని, ఇక టీడీపీలో ఉండే ప్రసక్తే లేదని త్రిమూర్తులు క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. కాకినాడలో ఇటీవల పార్టీ అధినేత నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన త్రిమూర్తులు..తర్వాత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదని వార్తలొచ్చాయి. త్వరలోనే వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్న త్రిమూర్తులుకు జగన్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారంలో ఉంది.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » తోట త్రిమూర్తులు రాజీనామా!