రాజధాని పై వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు పంచుమర్తి అనురాధ. భావితరాల కోసం 20 లక్షల ఉద్యోగాలతో నిర్మించిన రాజధాని ప్రాంతంలో వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని, 2014 లో 30 వేల ఎకరాలు అవసరం అని జగన్ చెప్తే… ఇప్పుడు ఎమ్మెల్యే రామక్రిష్ణ 15 వేల ఎకరాలు చాలు అంటున్నారన్నారు. చంద్రబాబు నిర్మించిన రాజధాని 13 జిల్లాల ప్రజల నాడి అని, రాజధాని విషయానికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవినీతి జరుగుతుంది అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ఏ ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయాని ఎద్దేవాచేశారు.
వైసీపీ చేస్తున్న పనుల వల్ల ఆ పార్టీ నాయకులూ చరిత్ర హీనులుగా మారబోతున్నారన్నారు అనురాధ.