భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా టీడీపీ దీక్ష చెయ్యనుంది. నవంబర్ 14 విజయవాడ లో టీడీపీ చేపట్టిన ఇసుక దీక్షలో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిగంటలవరకు ఈ దీక్ష జరగనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. డబ్బులు లేక ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మొదటి నుంచి కార్మికులకు అండగా టీడీపీ పార్టీ మద్దతు ఇస్తూ వస్తుంది.
ఇటీవల విశాఖపట్నం లో జనసేన అధినేత పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కి టీడీపీ, బీజేపీ పార్టీ లు సంపూర్ణ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.