ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ జగన్ ఒక్కటే ఇక జగన్ కేసులు అన్ని మాఫీ అవుతాయి, బాబు ను జైల్ కు పంపిస్తారు అని వైసీపీ క్యాడర్ ఆశలు పెట్టుకుంది. కానీ రోజు రోజుకు పరిస్థితులు తిరగబడుతున్నాయి, జగన్ కు కేసులలో ఎలాంటి ఊరట లభించక పోగా, సైకిల్ కమలం ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు టీడీపీ బీజేపీ బంధం బలపడుతుంది అనే వాదనకు బలం కలుగుతోంది. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే కారణం తో టీడీపీ బీజేపీ లు దూరం అయ్యాయి. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది, టీడీపీ తో పొత్తు చెడిపోవడం తో అసెంబ్లీ లో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ తో విభేదించి నష్టపోయాం అని భహిరంగంగ ప్రకటించారు.
టీడీపీ బీజేపీ లు దూరం కావడం వల్ల ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీలు కూడా నష్టపోయాయి. అందుకే కలిసుంటే ఇద్దరికి లాభం అనే ఆలోచనకు రెండు పార్టీలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆదిశగా ప్రయత్నాలను ముందుకుతీసుకెళ్లాడానికే బాబు నోట తప్పు చేశాను అనే మాట వచ్చింది అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. RSS చీఫ్ మోహన్ భగవత్ తో బాబు రహస్య మీటింగ్ కూడా ఇందుకే అనే వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం తెలుగు మీడియాకు సంబంధించిన ఒక కీలక వ్యక్తి అమిత్ షా ను కలిసింది కూడా అందుకే అనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం చంద్రబాబు పూణే వెళ్లి RSS చీఫ్ ను కలిసి దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. ఈ సమావేశం అత్యంత రహస్యంగా జరిగింది. ఈ పరిణామాలు అన్ని కూడా సైకిల్ కమలం కలిసిపోయేందుకే అనేది రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
జగన్ కేసులో సీబీఐ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు, వ్యక్తిగత హాజరు మినహాయింపుకు కూడా సీబీఐ ఒప్పుకోవడం లేదు, ఇంకొన్ని రోజుల్లో జగన్ బెయిల్ కూడా క్యాన్సల్ చేస్తారు అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మాత్రం వైసీపీ అభిమానులు ఆశపడుతున్నాడు, పూర్తిగా రివర్స్ లో జరుగుతుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.