ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కూడా వాడి వేడిగా జరుగుతున్నాయి. అయితే రైతులకు పంట గిట్టుబాటు ధరపై చర్చించాల్సిందిగా టీడీపీ పట్టుబట్టడంతో స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా జోక్యం చేసుకోవటంతో చంద్రబాబు పై కూడా తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీ పార్టీ ఆఫీస్ కాదంటూ చంద్రబాబు పై మండిపడ్డారు తమ్మినేని. చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరుకుగాను టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.