కియా అనుబంధ సంస్థలు, లూలూ, అదానీ డేటా సెంటర్ , ఫ్లాంక్లిన్ టెంపుల్టన్ క్లిన్ వంటి అంతర్జాతీయ సంస్థలను వెళ్లగొట్టినందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి స్కిల్ డెవలప్ మెంట్ శాఖ అప్పగించారా అంటూ ప్రశ్నించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. చంద్రబాబు హయాంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎనిమిదిన్నర లక్షలమందికి స్కిల్ సెంటర్లలో శిక్షణ అందించాము, అందులో శిక్షణ తీసుకున్న వారిలో 2 లక్షలమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో చంద్రబాబు కృషిని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. చంద్రబాబు హయాంలో ప్రకాశం, కడప, విశాఖ, తిరుపతి, గోదావరి జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాము. ఆ సెంటర్లలో వైసీపీ వాళ్లు ఏం ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు. క్రికెట్ బెట్టింగ్ లు, దొంగనోట్ల తయారీ, ఇసుక దందా, ఎర్ర చందనం ఎలా తరలించాలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారా లేక విశాఖలో భూ కబ్జాలు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. 10 రోజులకు ఓసారి వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెడితే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని తెలిపారు.