చత్తీస్ఘర్ లోని కోరియ జిల్లా బారాదియా గ్రామానికి చెందిన పిల్లీదేవి 30 ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతుంది. టీ తప్ప వేరే ఏ ఆహారం కూడా తినకుండా 30 ఏళ్లుగా సజీవంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంది ఆ మహిళ.
తన 11 ఏట ప్రారంభమైన ఈ టీ మాత్రమే తాగడం అనే కాన్సెప్ట్ ను 40 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా కొనసాగిస్తూనే ఉంది. టీ కాకుండా వేరే ఇతర ఆహార పదార్థాలు తినాలని చూస్తే…ఆమెకు వెంటనే వాంతులవుతాయట, కడుపులో వికారం కలుగుతుందట! అందుకే కేవలం టీని మాత్రమే తాగుతోంది ఆ మహిళ!
తాను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో డిస్ట్రిక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కు వెళ్లివచ్చినప్పటి నుండి ఫుడ్ ను వదిలేసి కేవలం టీని మాత్రమే తాగడం స్టార్ట్ చేసిందట..మొదట్లో టీలో బిస్కెట్లు టోస్టులు తిన్న దేవీ….తర్వాత వాటిని కూడా వదిలేసిందట! అయితే డాక్టర్లు మాత్రం 30 ఏళ్లుగా కేవలం టీ తాగి బతకడం అసాధ్యమంటున్నారు.