పెన్నుపట్టి పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఓ టీచర్..గన్ తో హల్ చల్ చేసింది. నాటు తుపాకీని పట్టుకొని వీదుల్లో తిరుగుతున్నటీచర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురిలో వెలుగుచూసింది.
కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్ లో టీచర్ గా పనిచేస్తోంది.అయితే..ఆమె మొయిన్పురిలోని కొత్వాలీ ప్రాంతంలో నాటు తుపాకీ జేబులో పెట్టుకొని తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు.వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
స్పందించిన పోలీసులు ఆ మహిళను గుర్తించి..ఆమె ప్యాంట్ జేబులో ఉన్నదేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆ టీచర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisements
ఆమెపై అక్రమాయుధాల కేసు నమోదు చేశామని మొయిన్ పురి ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు.ఆమె తుపాకీతో ఎక్కడికి వెళ్తోంది..దాన్నిఎక్కడ నుంచి సేకరించిందనే విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు ఎస్పీ.