యూపీలోని కాన్పూర్ లో జరిగిన దారుణ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. అక్కడి ప్రేమ్ నగర్ ఏరియాలోని ఓ ప్రైవేటు స్కూల్లో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థికి టీచర్ వింత శిక్ష వేశాడు. రెండో ఎక్కం చెప్పమని అడిగితే ఆ విద్యార్ధిని చెప్పలేకపోవడంతో.. ఆగ్రహించిన టీచర్ బాలుడి చేతికి డ్రిల్లింగ్ చేశాడు.
అదృష్టవశాత్తూ మరో విద్యార్థిని డ్రిల్లింగ్ మెషిన్ ప్లగ్ ను తీసేయడంతో బాధిత చిన్నారికి పెద్ద గాయం కాలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థిని తలిదండ్రులు, బంధువులు ఆ పాఠశాల వద్దకు చేరి.. సంబంధిత టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆ స్కూలు వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు ఈ విషయం ఉన్నత విద్యాశాఖ వరకు వెళ్ళింది.
అక్కడికి చేరుకున్న అధికారులు జరిగిన ఘటన గురించి తెలుసుకుని విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా తమ దర్యాప్తు మొదలు పెట్టారు.