మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. సీనియారిటీకి ప్రాధాన్యత పేరుతో ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో నాన్ లోకల్ టీచర్లకే ఎక్కువ లబ్ది చేకూరుతోందన్నారు. లోకల్-నాన్ లోకల్ 80-20 నిష్పత్తి నిబంధనలను పాటించడం లేదని తమ ఆవేదనను వివరించారు . స్థానికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఉపాధ్యాయులు చెప్పిందంతా విని స్థానికులకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని టీచర్లకు హామీ ఇచ్చారు సంజయ్.