ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలించాయని ఉద్యోగులు వెనక్కి తగ్గడంపై అబ్యంతరం తెలిచిన టీచర్లు ఆందోళన బాటపట్టారు. ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించినా టీచర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. ఫిట్మెంట్ పై కనీసం చర్చకు అనుమతించకపోవడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తమ పోరాటం దశలవారీగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై పోరాటంలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్తామని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
అన్ని స్కూల్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీచర్లు. 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్మెంట్ సాధనకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.