ఐపీఎల్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కీలక బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ముంబై జట్టుకు దూరమైనట్టు తెలుస్తోంది. ఆయన గాయం కారణంగా పలు సిరీస్ లకు దూరమవుతూ వస్తున్నారు. ఆయన ఐపీఎల్ కు అందుబాటులోకి వస్తారని అంతా భావించారు.
కానీ గాయం నుంచి ఆయన కోలుకునేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. దీంతో ఐపీఎల్‌లో ఆయన ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అతను ఎన్సీఏలో రిహబిలిటేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రీఫీకీ అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు.
కానీ అలా జరగలేదు. బుమ్రా గాయం తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. దీంతో ఆయన ఐపీఎల్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. బుమ్రా గైర్హజరు ముంబై టీమ్‌కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.
బుమ్రా స్థానంలో జట్టులో జోఫ్రా ఆర్చర్ ను తీసుకుంటారని తెలుస్తోంది. అది కొంచెం ఉపశమనం కలిగించే విషయమనే చెప్పాలి. బుమ్రా గతేడాది సెప్టెంబర్ లో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి మిస్ అయ్యాడు.