కేఎల్ రాహుల్‌తో పాటు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మేహా పటేల్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నెల చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. తన పెళ్లి కోసమే అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్ నుంచి సెలవు తీసుకున్నాడు. ఈ నెల 23న కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం జరగనున్న విషయం తెలిసిందే.
అక్షర్ పటేల్, మేహా పటేల్ చాలా కాలంగా ఒకరికొకరు డేటింగ్ చేస్తున్నారు. గతేడాది జనవరి 20న ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరిద్దరి పెళ్లి తేదీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే అక్షర్ పాట్లే తన పెళ్లి కారణంగానే బీసీసీఐ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో టీమిండియా స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న సమయంలో అక్షర్ పటేల్ తన గర్ల్ ఫ్రెండ్ మేహా పటేల్‌ను పెళ్లి చేసుకోన్నట్లు తెలుస్తోంది.
మేహా పటేల్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పంచుకుంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మేహా పటేల్ తన చేతిపై అక్షర్ పటేల్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం విశేషం. గతేడాది వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఇటీవల అక్షర్ పటేల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాకు కీలకంగా మారిపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాడు. రవీంద్ర జడేజాలేని లోటును అక్షర్ పటేల్ భర్తీ చేస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ దుమ్మురేపాడు.