బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో రెండు టెస్టుల్లో ఘన విజయాన్ని సాధించిన టీమ్ ఇండియా మూడో టెస్ట్‌లో మాత్రం బోల్తా కొట్టింది. టీమ్ ఇండియా ప్లేయర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాటు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలనే ఆత్రుత మూడో టెస్ట్‌లో ఓటమికి కారణమని మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రవిశాస్త్రి కామెంట్స్‌తో పలువురు మాజీ క్రికెటర్లు ఏకీభవించారు.
రవిశాస్త్రికి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే తాము మూడో టెస్ట్‌లో ఓడిపోయామన్నది పూర్తిగా అబద్దమని అన్నాడు. ప్లేయర్ల ఆటతీరు డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తే ఒకలా ఉంటుందని అన్నాడు. బయటి నుంచి మరోలా కనిపిస్తోందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతి మ్యాచ్‌లో దూకుడుగా ఆడటానికే ప్రయత్నిస్తుంటాం. . కొన్ని సార్లు అది వర్కవుట్ కాకపోవచ్చు. రెండు టెస్ట్‌ల తర్వాత మేము విజయానికి దూరం కాగానే చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఓడిపోయామని కామెంట్స్ చేస్తున్నారు. బయటి నుంచి ఆటను చూసే వారికి అలా అనిపిస్తోంది కావచ్చు. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తే ఆటతీరు మరోలా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుందో, ఆటగాళ్ల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయో బయటివాళ్లకు తెలియదు.
ప్రతి గేమ్‌లో గెలుపు కోసమే ఆటగాళ్లందరూ కష్టపడుతుంటారు. వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటారని రోహిత్ శర్మ అన్నాడు. మూడో టెస్ట్‌లో ఓటమికి కారణాలు చాలా ఉన్నాయని అన్నాడు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది మాత్రం అబద్ధమని తెలిపాడు. రవిశాస్త్రికి డ్రెస్సింగ్ రూమ్‌లలో ఉండే ఆటగాళ్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో తెలుసునంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.