హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజారుద్దీన్ భారీ విక్టరీ నమోదు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికల్లో అజారుద్దీన్ ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. అజారుద్దీన్ 147ఓట్లు సాధించి, 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా… మాజీ ఎంపీ వివేక్ బలపర్చిన ప్రకాశ్ చంద్‌కు కేవలం 74ఓట్లు మాత్రమే వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్ గా అజార్ ప్యానెల్ కి చెందిన జాన్ మనోజ్, సెక్రెటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేష్ శర్మ గెలుపొందారు.