హైదరాబాద్: కాంగ్రెస్ నేత, హెచ్.సీ.ఏ అద్యక్షుడు అజారుద్దీన్ టీఆర్ఎస్ గూటికే చేరబోతున్నట్లు కనపడుతోంది. హెచ్.సీ.ఏ ఎన్నికల్లో విజయం తర్వాత కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్ టీఆర్ఎస్‌కు వెళ్తున్నారనే వార్తలను ఖండించలేదు. నేను కేవలం రాష్ట్రంలో క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ను కోరానని, అన్ని పార్టీల నేతలను కలుస్తానని మీడియాకు తెలిపి వెళ్లిపోయారు. దాంతో అజార్ టీఆర్ఎస్ చేరిక ఖాయమేనన్న సంకేతం వెలువడ్డట్లైంది. అయితే, హెచ్.సీ.ఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు కోసం కేటీఆర్ సహాకరించారు అంటున్నారు మాజీ ఎంపీ వివేక్ టీం.