టీమిండియా సూపర్ ఫ్యాన్ చారులత పటేల్ మృతి చెందారు. వరల్డ్ కప్ 2019 సమయంలో టీమిండియా ఆడుతుంటే సూపర్ ఫ్యాన్ చారులత టీవీల్లో అందరిని అకర్శించారు. ఆమె మృతి పట్ల బీసీసీఐ ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేసింది. సుపర్ ఫ్యాన్ చారులత మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారని సంతాప సందేశంలో తెలిపింది. క్రికెట్ పట్ల ఆమెకున్న ప్రేమ మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం…ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక అని బీసీసీఐ తన సందేశంలో పేర్కొంది.
87 సంవత్సరాల సూపర్ ఫ్యాన్ చారులత ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసింది. చారులత తనను కలవడంపై స్పందిస్తూ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ” డియర్ చారులతాజీ…మా టీమ్ పైన మీకున్న ప్రేమ మాకెంతో స్ఫూర్తిదాయకం…మీ కుటుంబ సభ్యులతో కలిసి గేమ్ ను ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను”…అని రాశారు