డీఆర్ఎస్ ఏమోగానీ భారత క్రికెట్ జట్టుకు చాలా వరకు మ్యాచ్‌లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధోనీ లేకపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. ధోనీ ఉంటే డీఆర్ఎస్ తీసుకుంటే కచ్చితంగా భారత్‌కు అనుకూలంగా వస్తుందని అభిమానులు నమ్ముతారు.ధోనీ కూడా ఈ విషయంలో అనేక సార్లు తన ప్రతిభను రుజువు చేసుకున్నాడు.అయితే ధోనీ లేకపోవడం వల్ల టీమిండియాకు డీఆర్ఎస్ విషయంలో చాలా ఇబ్బంది కలుగుతోంది. అది మరోసారి నిరూపితమైంది.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో టి.నటరాజన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి అతని ప్యాడ్లకు తాకింది. బాల్ ట్రాకర్‌లో బంతి వికెట్లను తాకుతున్నట్లు వచ్చింది. కానీ టీమిండియా కెప్టెన్ కోహ్లి సరైన సమయంలో డీఆర్ఎస్ తీసుకోలేదు. ఆలస్యం చేశాడు. వికెట్ కీపర్ రాహుల్‌తో చర్చించి డీఆర్ఎస్ తీసుకునే సరికి అప్పటికే టైం అయిపోయిందని అంపైర్ చెప్పాడు. దీంతో భారత్‌కు డీఆర్ఎస్ లభించలేదు. కానీ బాల్ ట్రాకర్‌లో మాత్రం మాథ్యూ వేడ్ ఎల్‌బీడబ్ల్యూ అని స్పష్టంగా తేలింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
— Sandybatsman (@sandybatsman) December 8, 2020
No ball and late review will cost match today
— Pratik Niroula (@pratikniroula9) December 8, 2020
Catch , Stumping , late review, No ball …… where is the Discipline guys #AUSvIND
— நாடோடி (@Naadoodee) December 8, 2020
Future Kohli came to tell him to go for the review but it was a bit too late. pic.twitter.com/5rObysyzvS
— Heisenberg☢ (@internetumpire) December 8, 2020
The Indians were too late to review. Right call was made at the end
— Pasan Nanayakkara (@PasanNanayakka2) December 8, 2020
అయితే భారత్ డీఆర్ఎస్ ను ఉపయోగించుకోకపోవడంతో అప్పటికే ఫాంలో ఉన్న వేడ్ చెలరేగి పోయాడు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. తరువాత భారత్ ఆ స్కోరును ఛేజ్ చేయడంలో కొన్ని పరుగుల దూరంలో ఆగిపోయింది. అదే డీఆర్ఎస్ ను త్వరగా ఉపయోగించుకుని వేడ్‌ను ఔట్ చేసి పంపించి ఉంటే ఆసీస్ తక్కువ స్కోరు చేసేది. దీంతో భారత్ 3వ టీ20లోనూ గెలిచి సీరస్‌ను 3-0తో వైట్ వాష్ చేసి ఉండేది. కానీ భారత్ చేజేతులా చేసిన తప్పిదంతో అనవసరంగా మ్యాచ్‌లో ఓటమి పాలు కావల్సి వచ్చింది. డీఆర్ఎస్ ను అంచనా వేయడం, తీసుకోవడంలో ఆలస్యం చేసినందుకు భారత్ ఒక మ్యాచ్‌ను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.
Jadeja and now this 👎
— Daniel Alexander (@daniel86cricket) December 8, 2020
Advertisements
అయితే ధోనీ ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అభిమానులు మరోమారు అతన్ని గుర్తు చేశారు. ఇక సోషల్ మీడియాలో భారత్ డీఆర్ఎస్ తీసుకోవడంలో ఆలస్యం చేసినందుకు అభిమానులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భారత జట్టును ట్రోల్ చేస్తున్నారు. ఆటగాళ్లను విమర్శిస్తున్నారు. ఎంతైనా ధోనీ లేని లోటు ఇప్పుడు తెలిసొస్తుంది కదా..!