మరో సారి హైదరాబాద్ మెట్రో ట్రైన్ మొరాయించిన . మంగళవారం సాయంత్రం హైటెక్ సిటీ నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రో ట్రైన్ సాంకేతికలోపం కారణంగా రెండు గంటలపాటు నిలిచిపోయింది . అమీర్ పేట మెట్రో స్టేషన్ కు సమీపంలో ట్రాన్స్ పార్మెర్ పేలటంతో విద్యుత్ నిలిచిపోయింది. దీనితో ఒక్కసారిగా భారీశబ్ధం వచ్చి మెట్రో ట్రైన్ ఆగిపోయింది. వెంటనే అత్యవసర మార్గం ద్వారా ప్రణయాణికులను కిందకుదించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కారణంగా బస్సులు లేకపోవటంతో ప్రయాణికులు మెట్రోనే నమ్ముకున్నారు. అది కూడా సాయంత్రంపూట మెట్రో సేవలు నిలిచిపోవటంతో ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సుమారు రెండు గంటల తరువాత మెట్రోసేవలు అందుబాటులోకి వచ్చాయి.