భారత అభివృద్ధి ప్రయాణంలో టెక్నాలజీ, ట్యాలెంట్ రెండు మూల స్తంభాలు అని ప్రధాని మోడీ అన్నారు. ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సదస్సును వర్చువల్‌గా ప్రారంభిస్తూ ప్రధాని మోడీ మాట్లాడారు.
సంక్షోభ సమయంలో ఒకరికొరు సహాయం చేసుకునేందుకు అంతర్జాతీయ సమాజం సంస్థాగత విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వనరులను ప్రతి ప్రాంతంలోని చివరి మైల్ వరకు తీసుకు వెళ్లే విషయంలో ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు మార్గనిర్దేశం చేయగలవన్నారు.
అంత్యోధయ విజన్‌తో భారత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మిషిన్ మోడ్‌లో దేశంలోని చివరి మైల్ లోని చివరి వ్యక్తికి కూడా సాధికారిత కలిగించడమే దాని అర్థమని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాల్లేని 450 మిలియన్ల మంది అంటే అమెరికా జనాభాతో పోలిస్తే ఎక్కువ మందిని బ్యాంకింగ్ నెట్ లోకి తీసుకు వచ్చమన్నారు.
135 మిలియన్ల మందికి, అంటే ఫ్రాన్స్ జనాభా కంటే రెట్టింపు మందికి బీమా సౌకర్యం కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. సుమారు 110 మిలియన్ల కుటుంబాలకు పారిశుద్ధ్య సౌకర్యాలు, 60 మిలియన్లకు పైగా కుటుంబాలకు నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎవరూ వెనుకబడి పోకుండా భారత్ భరోసా ఇస్తోందన్నారు.