వర్షం పడినపుడు ఆకాశం నుంచి వడగళ్లు తరచూ పడుతూ ఉంటాయి. చేపలు కూడా పడ్డాయని మనం చాలా సార్లు విన్నాం. కానీ టెడ్డీ బేర్ల వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. ఇలాంటి ఘటన అమెరికా పెన్సిల్వేనియాలోని హర్ష్లీలో ఉన్న గెయింట్ సెంటర్లో జరిగింది. అయితే.. అవి నిజంగా ఆకాశం నుంచి పడలేదు. వర్షాన్ని మైమరిపించేలా మాత్రం చేశాయి.
అక్కడ ఐస్ హాకీ రవసత్తరంగా జరుగుతుంది. ఒకరిని మించి మరొకరు ఆడుతూ చుట్టూ ఉన్న ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నారు. నరాలు తెగిపోయే టెన్సన్.. కుర్చీలో కూర్చొనే పరిస్థితి లేదు. ప్రేక్షకుల దృష్టంతా ఆటమీదే ఉంది. అప్పుడు ఓ ప్లేయర్ దూసుకొని వెళ్లి గోల్ కొట్టేశాడు. అంతే.. చుట్టు ఉన్న ప్రేక్షకుల కేరింతలు, అరుపులతో స్టేడియం మార్మోమోగిపోయింది.
ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న టెడ్డీ బేర్ ను ఓ ప్రేక్షకుడు రింగ్ లో కి విసిరాడు. తరువాత ఒకరి తరువాత ఒకరు తమ టెడ్డీబేర్లు విసిరేశారు. కాసేపు అక్కడ టెడ్డీబేర్ల వర్షం కురిసిందా అనిపించేలా జరిగింది ఆ సన్నివేశం. క్షణాల్లో వేల సంఖ్యలో బొమ్మలు పోగయ్యాయి. అయితే.. అమెరికాలో ఇదేం కొత్త కాదు. కొంతకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.
ఇలా సేకరించిన ఈ బొమ్మలన్నింటినీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తారు. 2001 నుంచి ఇప్పటి వరకు సుమారు 2.7 లక్షల బొమ్మలను ఇలా సమీకరించారు. 2019లో 45,650 టెడ్డీలను విసిరి రికార్డు సృష్టించిన ప్రేక్షకుల పుణ్యమా అని ఆ మ్యాచ్ కూడా ఆగిపోంది. రింగ్ లో అన్ని బొమ్మలు ఉండటం వలన ఆడేందుకు పరిస్థితి అనుకూలించలేదు. దీంతో నిర్వహకులు మ్యాచ్ క్యాన్సిల్ చేశారు. 2019 తరువాత కరోనా కారణంగా ఇలా బొమ్మలు విసిరే పరిస్థితి లేదు. మళ్లీ కొత్తగా మొదలైంది.