సింగరేణి డిస్మిసల్ ఉద్యోగుల దీక్ష రికార్డు స్థాయికి చేరుకుంది. 5,672 రోజులుగా కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు తీన్మార్ మల్లన్న.అనారోగ్య కారణాలతో విధులకు హాజరు కాలేకపోయిన కార్మీకుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ తో 15 ఏళ్లుగా దీక్ష చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాలు ,తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కెసిఆర్, కవిత మోసం చేశారని ఆరోపించారు మల్లన్న. కెసిఆర్ కారణంగా 6వేల మంది అభాగ్యుల జీవితాలలో చీకట్లు అలముకున్నాయన్నారు. మీ ఫీసులో మా డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు లేకుంటే మాభూమిలో మీకు బొగ్గు ఎక్కడిదని ప్రశ్నించారు మల్లన్న.
అన్ఫిట్ పేరుతో కార్మికులను వేధించి డిస్మిస్ చేసిన యాజమాన్యం వైఖరిపై మండిపడ్డారు. కార్మీకులు అనారోగ్యం తో ఉద్యోగులు చేయలేక పోయారు మరి ఆరోగ్యవంతుడైన సీఎం ఎందుకు సచివాలయంలో డ్యూటీకి కావడం లేదంటూ విమర్శించారు. సింగరేణి కార్మికుల వలే కేసీఆర్ కు కూడా ఆరోగ్య పరీక్షలు చేసి ఫిట్నెస్ చెక్ చేయాలి. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుంటే కేటీఆర్ కు కూడా ఏ పదవి ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారు.