జూబ్లీహిల్స్‌లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ రేవ్ పార్టీలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఓ ఫార్మా కంపెనీ తమ సేల్స్ ను పెంచుకోవడమే లక్ష్యంగా ఉద్యోగులను, డాక్టర్లను ఆకర్షించేందుకు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ ప్రతి సంవత్సరం ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తుందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఈ రేవ్ పార్టీలో 22మంది యువతులతో అర్ధనగ్న ప్రదర్శనలు చేయించారని, వారిని వ్యభిచారం కోసం తీసుకువచ్చారని తెలిపారు. సినిమా ఛాన్స్ కోసం నగరానికి వచ్చిన నెల్లూరు యువతులకు మాయమాటలు చెప్తూ రేవ్ పార్టీలో దించుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఫార్మా కంపెనీ పేరును గోప్యంగా ఉంచడంపై సర్వత్రా పోలీసుల వ్యవహారశైలిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisements