తెలంగాణలో సమస్త సమస్యలకు మూలం చిన్నజీయర్ స్వామి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లన్న. ఆర్టీసీని కొల్లగొట్టడానికి ఆర్టీసీని లేకుండా చెయ్యడానికి కేసీఆర్, మైహోం, మెఘాలు కుట్ర చేశారన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు మెఘాకు తెలంగాణ భూములన్నీ మై హోమ్ కు కట్టబెట్టటానికి అంటూ తన వీడియో లో మల్లన్న విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను ఈ కూటమి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
దొంగల ముఠా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ప్రతి సమస్యకు మూలకారణం చిన్న జీయర్ స్వామన్నారు మల్లన్న. చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని ముట్టడిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయన్నారు. సన్యాసిగా ఉన్న చిన్న జీయర్ కు ఈ అలంకారాలు, ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్యకర్తలందరు చిన్న జీయర్, మెగా, మై హోమ్ లపై యుద్ధం చేయాలన్నారు తీన్మార్ మల్లన్న.