తీన్మార్ మల్లన్నగా తెలంగాణ ప్రజలకు బాగా పరిచయమైన జర్నలిస్ట్ నవీన్ కుమార్ ఇంకో అడుగు ముందుకు వెయ్యబోతున్నారు. గత కొద్ది రోజులుగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను అందరికి చెప్పే ప్రయత్నం చేసారు. చాలా డాక్యూమెంట్లను సంపాదించి… ఆఖరికి రైతు బంధు కూడా ఒక పెద్ద భూకబ్జా స్కాం అని చెప్పి అందరిని ఆశ్చర్యపోయేలా చేసారు. దానితో చాలా మంది ప్రజలు “మల్లన్నకి చాలా ధైర్యం” అని అంటున్నారు. మరో పక్క… లేదు మల్లన్న ఎదో రాజకీయ లబ్ది కోసమే ఇవన్నీ చేస్తున్నాడు అని అనేవారు లేకపోలేదు. ఇంతక ముందు కాంగ్రెస్ తరుపున ఎంఎల్ సి గా కాంగ్రెస్ తరుపున పోటీ చేసాడు కాబట్టి ఆ మాట వచ్చిందని అంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా తెరాస నాయకులను ఎలా తిడుతున్నాడో, అదే విధంగా కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టడం లేదు. రేవంత్ రెడ్డి, కోదండరాం రెడ్డి కూడా కెసిఆర్ ఏమి చేసిన అడగరు… ఎందుకంటే వీళ్లంతా రెడ్డిలు కాబట్టి అని కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసారు. బలహీన వర్గాల కోసం తన పోరాటం అని చెప్పే మల్లన్న ఇప్పుడు హుజూర్ నగర్‌లో ఉప ఎన్నిక బరిలో పోటీచేయబోతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు ఈ నెల 30తో నామినేషన్ల గడువు ముగియనుంది.