హైదరాబాద్ తిరుమలగిరి పోలీసులు తీన్మార్ మల్లన్నను విచారిస్తున్నారు. దీనిపై ఆయన తరఫు న్యాయవాది స్పందిస్తూ… ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ విచారణకు సహకరిస్తున్నారని చెప్పారు. ఇంకో రెండు, మూడు రోజులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లోనే మల్లన్నను ఉంచుతారని సమాచారం.
మీడియాను సైతం పోలీస్ స్టేషన్ లోకి అనుమతించడం లేదు పోలీసులు. అక్రమ కేసులకు నిరసనగా మల్లన్న జైలులో ఆమరణ దీక్షకు దిగారు. మంచినీళ్లు సైతం తీసుకోకోకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. మల్లన్న బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.