తేజాస్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను పునఃప్రారంభించినట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) తెలిపింది. ముంబై- అహ్మదాబాద్ ల మధ్య ఫిబ్రవరిలో ఈ సర్వీసులు పునః ప్రారంభం అయినట్టు వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.
‘ ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనలను సడలిస్తున్నాయి. అయినప్పటికీ ప్రయాణ సమయంలో ప్రయాణీకులు కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైల్వే సిబ్బందితో ప్రయాణీకులు సహకరించాలి” అని కోరింది.
ప్రయాణీకులు ఇతర రైళ్లతో పోలిస్తే తేజోస్ లో ప్రయాణించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర రైళ్లలో కంటే తేజాస్ లో ఉన్నతమైన సేవలను అందిస్తున్నాము. ఇందులో శానిటేషన్ కు ఉన్నతమైన శానిటేషన్ పద్దతులను పాటిస్తున్నాము.
‘ ప్రజలకు మంచి సేవలను అందించాలన్నదే మా లక్ష్యం. ఇందు కోసం నిరంతరంగా శ్రమిస్తున్నాము. ఉత్తమమైన ఆరోగ్య పద్దతులు, అత్యున్నత స్థాయి ఆతిథ్య పద్దతులను ఉపయోగించి ప్రయాణీకులకు సమయానికి అనుగుణంగా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాము” అని ఐఆర్ సీటీసీ తెలిపింది.