హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆంక్షలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను సాగర్ లో నిమజ్జనానికి కోర్టు నో చెప్పింది. దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసినా హైకోర్టు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.
?
దాదాపు నెల నుండి తాము ఏర్పాట్లు చేశామని, ఇప్పటికిప్పుడు కుంటలు ఏర్పాటు చేయటం సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తామని, వచ్చే ఏడాది నుండి కోర్టు తీర్పు అమలు చేస్తామని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపినా… ధర్మాసనం మాత్రం కన్విన్స్ కాలేదు. కాలుష్యానికి ఎలా అనుమతివ్వాలంటూ ప్రశ్నించింది.
దీంతో, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని ప్రభుత్వం సుప్రీంను కోరబోతుంది. అయితే… సుప్రీంలో ఫైట్ చేస్తూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే బలపరిస్తే… ఎలా అన్న అంశంపై జీహెచ్ఎంసీ దృష్టిపెట్టినట్లు సమాచారం.