తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 313 మంది బాధితులు కోలుకున్నారు. అలాగే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,551కు చేరింది.
ఇక ఇప్పటి వరకు 6,52,398 మంది కోలుకోగా..మొత్తం 3,895 మంది మృతి చెందారు. ప్రస్తుతం 5,258 యాక్టివ్ కేసులున్నాయి.