మీరు ఓనర్లు కాదు, కేసీఆర్ కట్టిన బేనర్లు.. మంత్రి పదవులు రాకుంటేనే మీకు అంత మండుతోందంటే.. మరి మంత్లీ పోషణకే దిక్కులేని మాకెంత మండాలి.. అంటున్నారు మిర్యాలగూడకు చెందిన అడ్వకేట్ రెడ్డిపల్లి సైదులు
ఒరేయ్.. సిగ్గు తప్పిన నాయకుల్లారా! మొన్నటిదాకా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సంక నాకారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యాక మంత్రి పదవి ఇవ్వలేదని కన్నీళ్లు బుక్కుతున్నారు. మీకు ఏమాత్రమైనా రోషం ఉందా…? నాలుగు కోట్ల మంది కలలు కన్న తెలంగాణ రా ఇది.. మంత్రి పదవులు రానందుకే అంత తిరగబడితే.. మా బతుకులు మరచినందుకు మేమెంత కుమిలిపోవాలి.. ఇంటర్మీడియట్ పసిపిల్లలు మాడి పోతే మీ నోర్లు లేవవు. ఆంధ్ర గుత్తా పెంతందార్లకు కోట్లు కుమ్మరిస్తే మీ నోర్లు లేవవు… జర్నలిస్టులకు నాలుగేళ్ళ కిందట ఇంద్ర భవనాలు కట్టిస్తా అని మోసం చేస్తే మీ నోర్లు అడగవు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ ఏమైందని అడగరు. రిక్రూట్‌మెంట్లు ఎందుకు ఆగిపోయిందీ అడగరు. ఒరేయ్! మీరు తెలంగాణకు ఓనర్లు కాదు. మీ పార్టీకి కేసీఆర్ ఓనర్, మీరు బేనరు. మేమంతా తెలంగాణ ఉద్యమానికి ఓనర్లం… మీరు మంత్రి పదవుల కోసం బ్లాక్ మెయిల్ చేసే గోమార్లు. ఈ ఉద్యమానికి ప్రతి తెలంగాణ బిడ్డ ఓనరే.. మొన్న ఈటెల, రసమయి, నాయిని, జోగు రామన్న.. ఎందుకు తన్నుకొస్తుంది ఆవేశం.. ఉద్యమం ఎలా గుర్తొస్తుంది… మనసు మర్లబడ్డదేందుకు.. అయ్యో మంత్రి పదవులు రాలేదనా.. మాకు మంత్లి పోషణకే దిక్కు లేదు.. మేమెంత రగిలి పోవాలి.. డబ్బుల కట్టలు పంచి కొనుక్కున్నారుగా.. అమ్ముకొండిరా.. నా తెలంగాణను.. పాపం పండుద్ది.. జై నా తెలంగాణ.. మోగాలి రుద్ర వీణ…