తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో కొత్తవారిని నియమించింది.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా అరూప్ గోస్వామిని నియమించారు. ఆయన ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా ఉన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళ్లనున్నారు. ఇక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‍గా హిమా కోహ్లీ నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజే చౌహన్ ఉత్తరాఖండ్‍కు బదిలీ చేశారు. జస్టిస్ హిమా కోహ్లీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.